IND vs ENG t20: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుతో కలిసి ప్రత్యక్ష్యమయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించాడు. ఇటీవలే జరిగిన తన 41 పుట్టినరోజు వింబుల్డన్ మ్యాచ్‌ను తిలకించాడు కెప్టెన్ కూల్. ఈ క్రమంలోనే ఎడ్జ్‌బాస్టన్‌లో ఉన్న భారత జట్టును కలిశాడు మహీ. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పెట్టింది. " గ్రేట్ ధోనీ మట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు" అని పోస్ట్ చేసింది.
IND vs ENG t20: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 49 రన్స్ తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుచుకుంది టీమ్‌ఇండియా. 17 ఓవర్లలో 121 పరుగులకు ఇంగ్లాండ్‌ను భారత్ ఆల్ అవుట్ చేసింది. ఇంగ్లాండ్ జట్టులో మొయిన్ అలీ (35; 21 బంతుల్లో 3x4, 2x6), డేవిడ్ విల్లే (33 నాటౌట్; 22 బంతుల్లో 3x4, 2x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లు ఆది నుంచీ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. భువనేశ్వర్ కుమార్ 3, బుమ్రా, చాహల్ 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్య, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.