Ms Dhoni US Open: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ యూఎస్ ఓపెన్‌లో సందడి చేశాడు. ఈ టోర్నమెంట్లో గురువారం కార్లోస్ అల్కరాస్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను.. స్టేడియంలో స్నేహితులతో కలిసి వీక్షించాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఆస్వాదించాడు. అయితే ఆట మధ్యలో స్పెయిన్ ఆటగాడు అల్కరాస్.. రెస్ట్ తీసుకొని డ్రింక్స్ తాగుతుండగా అతడి వెనుకవైపు ఫ్రెండ్స్‌తో కూర్చొని ముచ్చటిస్తున్న ధోనీ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే అతడికి టెన్నిస్ ఆటంటే ఎంత ఇష్టమో గతంలో ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు.
MS Dhoni Leg Surgery :అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ప్రస్తుతం కెరీర్లో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు.ఐపీఎల్-2023లో మహీ చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం అతడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ లైఫ్‌ను కాస్త ఎంజాయ్ చేస్తున్నాడు.