తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రోజు ఫ్యాన్స్​కు ధోనీ సర్​ప్రైజ్​.. ఏం ఇవ్వబోతున్నాడో?

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ అభిమానులకు ఓ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నాడు. సెప్టెంబరు 25న మధ్యాహ్నం అదేంటో చెబుతానని సోషల్​మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అదేంటా అని ఫ్యాన్స్​ తెగ ఆరాటపడుతున్నారు.

dhoni surprise
ధోనీ సర్​ ప్రైజ్​

By

Published : Sep 24, 2022, 7:36 PM IST

ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ. జార్ఖండ్‌ డైనమైట్‌.. కెప్టెన్‌ కూల్‌.. ద ఫినిషర్‌.. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ప్రపంచ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు సైతం తనకు సలాం కొట్టేలా మైదానంతో సత్తా చాటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​ను వీడ్కోలు పలికిన అతడు ప్రస్తుతం ఐపీఎల్​లో సక్సెస్​ఫుల్​ కెప్టెన్​గా సీఎస్కేకు సారథ్యం వహిస్తున్నాడు.

అయితే మహీ ఇతర క్రికెటర్లతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండని విషయం తెలిసిందే. తన గారాలపట్టి జీవాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు మాత్రం అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంటుంటాడు. తన ఇంటర్నేషనల్​ క్రికెట్​కు వీడ్కోలు పలికేటప్పుడు ఓ చిన్న మెసేజ్ ​ పెట్టి అందర్నీ షాక్​కు గురి చేశాడు.

అయితే ఇప్పుడు మళ్లీ సోషల్​మీడియాలో అతడు పెట్టిన ఓ పోస్ట్ క్రికెట్ అభిమానుల మదిలో పలు అనుమానాలకు దారీ తీస్తోంది. ఎందుకంటే అతడు తన ఫేస్​బుక్​లో సెప్టెంబరు 25న మధ్యాహ్నం 2 గంటలకు లైవ్​లో ఓ ఎక్సైటింగ్​ న్యూస్​ను పంచుకోబోతున్నట్లు పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు ఏంటిదా అని తెగ ఆలోచించేస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది.. మహీ ఐపీఎల్​ కెరీర్​కు గుడ్​బై చెప్పబోతున్నాడా అని అనుకుంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే అది షాకింగ్ న్యూస్ అవుతుంది కానీ ఎక్సైటింగ్​ న్యూస్​ ఎందుకు అవుతుంది అని ఇంకొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ మహీ ఏం చెప్పబోతున్నాడా అనే ఉత్సుకత ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్​లో విపరీతంగా నెలకొంది. ఆ ఆసక్తికి తెరదించాలంటే సెప్టెంబరు 25 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆగాల్సిందే..

ధోనీ సర్​ ప్రైజ్​

కాగా, ఐపీఎల్​లో అత్యంత స్థిరమైన జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు (సీఎస్‌కే) పేరుంది. అలాంటి జట్టుకు ప్రారంభ సీజన్‌ నుంచి మొన్న జరిగిన 14వ సీజన్‌ వరకు సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోనీ.. తన కెప్టెన్సీలో సీఎస్‌కేను తొమ్మిదిసార్లు ఫైనల్స్‌కు చేర్చాడు. నాలుగు సార్లు కప్‌ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినా తనలోని నాయకత్వ లక్షణాల్లో వన్నె తగ్గలేదని నిరూపించాడు. మొత్తంగా ఐపీఎల్​లో 234 మ్యాచులు ఆడి 4978 రన్స్​ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్​ విషయానికొస్తే.. 90 టెస్టులు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా, 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10శతకాలు, 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 98 టీ20లు ఆడగా 1617 రన్స్​ చేశాడు.

ఇదీ చూడండి: India VS Australia: ఇద్దరిది ఒకే సమస్య​.. సిరీస్​ దక్కేదెవరికో?

ABOUT THE AUTHOR

...view details