తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెలుగు సినిమాలకు నిర్మాతగా ధోని.. ఆ స్టార్​ హీరోయిన్​తో ఎంట్రీ..! - ఎమ్​ఎస్​ ధోని ప్రొడక్షన్​ హౌస్​

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త వెంచర్​లోకి అడుగుపెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలను తెరకెక్కించనున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై ఈ బ్యానర్ ప్రధానంగా దృష్టిసారించనుంది. ఈ నేపథ్యంలో ఓ తమిళ స్టార్​ హీరోయిన్​తో సినిమా తీయనున్నారట.. ఆమె ఎవరంటే..

ms dhnoni entertainment
ms dhoni

By

Published : Oct 11, 2022, 4:14 PM IST

ప్రముఖ స్టార్​ క్రికెటర్​ ఎమ్​ఎస్​ ధోని తన బ్యాటింగ్​ స్టైల్​తో క్రికెట్​ దిగ్గజాలలో ఒకరిగా నిలిచారు. టీమ్​ ఇండియాకు కెప్టెన్సీ వహించిన ధోని.. 2007 ప్రపంచ కప్ ట్రోఫీ​ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్​కి కెప్టెన్​గా వ్యవహరించి అనేక విజయాలు సాధించారు. కొన్నేళ్ల క్రితం క్రికెట్​కు బైబై చెప్పిన ధోనీ తన ఫ్యాన్స్​తో అప్పుడప్పుడు మాత్రమే టచ్​లో ఉంటున్నారు. ఓ వైపు యాడ్స్​ చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ బిజీ అయిన ధోని ఇప్పుడు మరింత బిజీ అవ్వనున్నారు.

ఎమ్​ఎస్​ ధోని ఎంటర్​టైన్​మెంట్స్​ అనే ప్రొడక్షన్​ హౌస్​ను స్థాపించిన ధోని అందులో ఇకపై తెలుగు, మలయాళ, తమిళ చిత్రాలను నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధోని సతీమణి సాక్షి సింగ్​ ధోని ఈ ప్రొడక్షన్​ హౌస్​ వ్యవహారకర్తగా ఉన్నారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే 'రోర్ ఆఫ్ ద లయన్', 'ది హిడెన్ హిందు', 'బ్లేజ్ టు గ్లోరీ' వంటి సినిమాలను నిర్మించింది.

"తమిళ, తెలుగు,మలయాళంలో చిత్రాలను నిర్మించడానికి ధోని దక్షిణాదిలో 'ధోని ఎంటర్‌టైన్‌మెంట్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నారు" అని లెట్స్ సినిమా తమ ట్విట్టర్ హ్యాండిల్‌ను ద్వారా ఆదివారం ఈ ప్రకటనను విడుదల చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తన ప్రొడక్షన్​లో నయనతార నటిస్తున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో హల్​చల్​ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటనలు రాలేదు.

ఇదీ చదవండి:బాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్​ ఎంట్రీ.. ఆ సినిమాతోనే

రెండేళ్లలో తొలిసారి అమితాబ్​ బచ్చన్​ అలా.. ఫ్యాన్స్​కు బిగ్​ సర్​ప్రైజ్​!

ABOUT THE AUTHOR

...view details