తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొత్త కారులో క్రికెటర్లతో కలిసి చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో చూశారా? - dhoni latest news

మార్కెట్‌లో కొత్తగా ఏ లగ్జరీ వాహనం వచ్చినా తన గ్యారేజీలో చేర్చుతుంటాడు ధోనీ. తాజాగా ఈ ఝార్ఖండ్‌ డైనమైట్‌ 'కియా ఈవీ6' కారును కొని ఇంటికి తీసుకొచ్చాడు. తనవెంట రుతురాజ్‌ గైక్వాడ్‌, కేదార్‌ జాదవ్‌నూ ఈ కారులో తీసుకెళ్లి రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు.

Dhoni Ride On EV Car
Dhoni Ride On EV Car

By

Published : Nov 19, 2022, 11:32 AM IST

Dhoni Ride On EV Car: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంతిష్టమో తెలిసిందే. మార్కెట్‌లో కొత్తగా ఏ లగ్జరీ వాహనం వచ్చినా తన గ్యారేజీలో చేర్చుతుంటాడు. ఇలా అతడి వద్ద పెద్ద సంఖ్యలో కార్లు, వింటేజ్‌ వాహనాల కలెక్షనే ఉంది. తాజాగా ఈ ఝార్ఖండ్‌ డైనమైట్‌ 'కియా ఈవీ6' కారును కొని ఇంటికి తీసుకొచ్చాడు. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఇది.

దీనిలో సరదాగా ధోనీ రైడ్‌కు వెళ్లాడు. తనవెంట రుతురాజ్‌ గైక్వాడ్‌, కేదార్‌ జాదవ్‌నూ ఈ కారులో తీసుకెళ్లి రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇక ధోనీ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం భారత టీ20 లీగ్‌లో చైన్నై సారథిగా కొనసాగుతున్నాడు. ఈ జట్టు ఇటీవల తమ వద్ద అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details