తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహీపై వీరాభిమానం.. రెండోసారి 1436కి.మీల కాలినడక

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీని(dhoni fan walked 1400 km) కలిసేందుకు ఓ వీరాభిమాని మరోసారి పెద్ద సాహసమే చేశాడు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఏకంగా 1436 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మహీని కలిశాడు(dhoni fan walks).

mahi
మహీ

By

Published : Nov 18, 2021, 3:11 PM IST

Updated : Nov 18, 2021, 3:58 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి(Dhoni latest news) భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మిస్టర్​ కూల్​పై అభిమానులు తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. తాజాగా మహీ వీరాభిమాని మరోసారి పెద్ద సాహసమే చేసి మనసు దోచుకున్నాడు(dhoni fan walked 1400 km).

హరియాణాకు చెందిన అజయ్ గిల్.. తన ఫేవరెట్​ను కలిసేందుకు మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఏకంగా 1436 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు(dhoni fan walks). హరియాణాలోకి తన గ్రామం నుంచి కాలినడకన రాంచిలోని మహీ ఫామ్​హౌస్​కు చేరుకున్నాడు(Dhoni farmhouse).

ధోనీ ఫ్యాన్

ఈ విషయం తెలుసుకున్న ధోనీ తన అభిమానిని ఇంటికి ఆహ్వానించి అతడితో ముచ్చటించాడు. తన ఫామ్​హౌస్​లో అతడు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. మళ్లీ అతడిని తన స్వగ్రామానికి పంపించేందుకు విమాన టికెట్​ కూడా బుక్​ చేశాడు. దీంతో సదరు అభిమాని ఎంతో సంతోషపడిపోయాడు.

అంతకుముందు ఆగస్టులోనూ పాదయాత్ర చేసుకుంటూ ధోనీ ఇంటికి చేరుకున్నాడు అజయ్. కానీ ఆ సమయంలో ఐపీఎల్​ రెండోదశ ఉండటం వల్ల మహీ.. దుబాయ్​లో ఉన్నాడు. అయితే మిస్టర్​ కూల్​ వచ్చేంతవరకు తాను మహీ ఫామ్​హౌస్​ దగ్గరే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. కానీ పలువురు సామాజిక కార్యకర్తలు అతడికి నచ్చజెప్పి తన స్వగ్రామానికి తిరిగి పంపించారు.

ఇదీ చదవండి:

భయపెట్టేలా చూసిన భారత క్రికెటర్.. రూ.లక్ష సొంతం

భారత్-న్యూజిలాండ్ టీ20 వాయిదా వేయాలని హైకోర్టులో పిల్

Last Updated : Nov 18, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details