భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. టీమ్ఇండియా రెట్రో జెర్సీలో కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ధోనీ ధరించిన జెర్సీ.. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కోసం డిజైన్ చేసిన జెర్సీలా ఉంది.
ఫుట్‌బాలర్‌గా..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పుడు ఫుట్‌బాలర్ అవతారమెత్తాడు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి ఆడాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను హీరో రణ్వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే ధోనీ ఎప్పటికీ తన అభిమాన ఆటగాడేనని అందులో పేర్కొన్నాడు. ధోనీ కోసమే తాను ఓ యాడ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు రణ్వీర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.