టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కొత్త అవతారం ఎత్తాడు. ఇప్పటివరకు క్రికెటర్‌గా రాణిస్తున్న మహీ ఇప్పుడు గోల్ఫ్‌తో కొత్త కెరీర్‌ను ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోను.. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెప్టెన్ కూల్ ఇన్ ది గోల్ఫ్ హౌస్ అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. కాగా మహీతో పాటు టీమ్ఇండియా దిగ్గజం కపిల్‌దేవ్ కూడా గోల్ఫ్ ఆటలో భాగమయ్యాడు. ఇక ధోని గోల్ఫ్ ఆడుతుంటే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌లా అనిపించాడు. అతను కొట్టిన షాట్స్ క్రికెట్‌లో హెలికాప్టర్ షాట్లను తలపించాయి.
ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. 90 టెస్టులు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా, 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10శతకాలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 98 టీ20లు ఆడగా 1617 రన్స్ చేశాడు.