ఐపీఎల్ వాయిదాతో ఇంటి వద్ద సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపడమే కాకుండా తన ఫామ్‌హౌజ్‌లోని పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తున్నాడు.
గుర్రానికి ధోనీ మసాజ్.. వీడియో వైరల్ - ధోనీ తాజా వార్తలు
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన గుర్రానికి మసాజ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహి భార్య సాక్షి.. సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
![గుర్రానికి ధోనీ మసాజ్.. వీడియో వైరల్ ms dhoni, chetak horse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11935240-155-11935240-1622212905242.jpg)
ఎంఎస్ ధోనీ, చేతక్ గుర్రం
గుర్రానికి మసాజ్ చేస్తున్న ధోనీ
ఇటీవల కొత్తగా తెచ్చిన 'చేతక్' అనే గుర్రానికి ధోనీ మసాజ్ చేస్తుండగా.. అతడి భార్య సాక్షి ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించింది. దీనిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది సాక్షి. ప్రస్తుతం ఈ వీడియో మహి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి:'టీమ్‌పై కోహ్లీ కంటే అతడి ప్రభావమే ఎక్కువ'