తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీని చెన్నై ఎప్పటికీ వదులుకోదు.. అతడొక మహారాజు'

భారత క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​ ధోనీపై ఆసీస్​ మాజీ క్రికెటర్​ బ్రాడ్​ హాగ్​ ప్రశంసలు కురిపించాడు​. ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు అతడొక 'మహారాజు' లాంటివాడని అన్నాడు. డిసెంబరులో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో మహిని ఎట్టి పరిస్థితుల్లో చెన్నై ఫ్రాంఛైజీ వదులుకోదని పేర్కొన్నాడు.

ms dhoni, brad hogg
ఎంఎస్ ధోనీ, బ్రాడ్ హాగ్

By

Published : Jul 6, 2021, 12:58 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీపై ప్రశంసలు కురిపించాడు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్​ హాగ్. చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు ధోనీ 'మహారాజు' లాంటివాడని అన్నాడు. అతడిని సీఎస్కే ఫ్రాంఛైజీ ఎప్పటికీ వదులుకోదని తెలిపాడు.

"ధోనీని చెన్నై జట్టు ఎప్పటికీ వదులుకోదు. సీఎస్​కే ఫ్రాంఛైజీకి అతడు 'మహారాజు' లాంటివాడు. మహి ఆ జట్టుకు ఆటగాడి నుంచి కోచ్​గానూ మరే అవకాశం ఉంది."

- బ్రాడ్​ హాగ్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​.

ఈ డిసెంబర్​లో ఐపీఎల్ మెగా​ వేలం జరగనున్న నేపథ్యంలో ప్రతి ఫ్రాంఛైజీ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చని బీసీసీఐ సూచించింది. ధోనీని.. సీఎస్కే వదిలేస్తే ఏ ఫ్రాంఛైజీ అయినా అతన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పాడు బ్రాడ్​హాగ్.

ఐపీఎల్​ ప్రారంభం నుంచి చెన్నై జట్టుకు ధోనీ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఆ టీమ్​కు మూడు సార్లు టైటిల్ అందించగా.. అతని నాయకత్వంలో ఐదు సార్లు రన్నరప్​గా నిలిచింది. ప్రస్తుత సీజన్​లోనూ ఏడు మ్యాచ్​లు ఆడిన ధోనీసేన.. 5 మ్యాచ్​లు గెలిచి కప్​ ఫెవరేట్లలో ఒకటిగా ఉంది. కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ టోర్నీని యూఏఈ వేదికగా సెప్టెంబర్​-అక్టోబర్​లో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:టీ20ల్లో రికార్డు.. 'డబుల్​'తో మెరిసిన యువ క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details