టీ20 ప్రపంచకప్.. వన్డే వరల్డ్ కప్ అనగానే క్రికెట్ అభిమానులు తలచుకొనే పేరు ధోనీ. అతడి నాయకత్వంలోనే టీమ్‌ఇండియా రెండు కప్‌లను ముద్దాడింది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే ఈసారి మాత్రం అలాంటి బాధ్యతలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రశ్నను అడిగేందుకు ఆ ఇంటర్వ్యూ హోస్ట్ ప్రయత్నించాడు. అయితే దానికి ధోనీ ఇచ్చిన ఫన్నీ సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్‌పై ధోనీ ఫన్నీ రెస్పాన్స్.. వీడియో వైరల్ - ధోనీ టీ20 ప్రపంచకప్
టీ20 ప్రపంచకప్ గురించి అడగగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ మహీ ఏం అన్నాడంటే..
"మహీ టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడేందుకు సమయం సమీపిస్తోంది. క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న అడగకపోతే కొంతమంది అభిమానులు నన్ను కొడతారు (సరదాగా)" అని హోస్ట్ వ్యాఖ్యానించగా.. ఠక్కున ధోనీ స్పందించాడు. "ప్రస్తుతం నేను ప్రపంచకప్ ఆడటం లేదు. ఇప్పటికే టీమ్‌ఇండియా ఆసీస్‌కు చేరుకొంది" అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని రెండు రోజుల కిందట ట్విటర్‌లో పంచుకోగా.. ఇప్పుడది వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:భారత్ పాక్ స్లెడ్జింగ్, దాయాదుల మధ్య ఉత్కంఠ రేపిన ఘటనలు ఇవే