తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీలా ఉండలేను.. ధోనీకి నాకూ పోలిక ఉంది: డుప్లెసిస్​ - చెన్నై సూపర్​ కింగ్స్

MS Dhoni Faf Duplesis: తన కెరీర్​లో అద్భుతమైన సారథులతో కలిసి పనిచేయడం అదృష్టమని అని అన్నాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్. ఐపీఎల్​లో చెన్నైసూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీకీ, తనకూ మధ్య ఓ పోలిక ఉందని చెప్పాడు. ఇటీవలే ఆర్​సీబీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫాఫ్​.

MS Dhoni with Faf Duplesis
ధోనితో డుప్లెసిస్​

By

Published : Mar 13, 2022, 6:15 PM IST

MS Dhoni Faf Duplesis: ఐపీఎల్​లో చెన్నైసూపర్​ కింగ్స్​ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీకి, తనకు మధ్య పోలిక ఉందన్నాడు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు కొత్త కెప్టెన్ ఫాఫ్​​ డుప్లెసిస్​. ధోనీ అద్భుతమై సారథి అని, అతని ప్రయాణంలో భాగం కావడం తన అదృష్టమని చెప్పాడు. అయితే ఐపీఎల్​ సారథిగా మాత్రం తాను ఎవరినీ అనుకరించబోనని తెలిపాడు.

డుప్లెసిస్​

కెరీర్​లో అద్భుతమైన నాయకులతో కలిసి పనిచేయడం నా అదృష్టం. దక్షిణాఫ్రికా జట్టు గొప్ప కెప్టెన్ గ్రేమ్​ స్మిత్​, ఆ తర్వాత పదేళ్ల పాటు ధోనీ, స్టీఫెన్ ఫ్లెమింగ్​ లాంటి నాయకుల సారథ్యంలో ఆడాను. ధోనీకి నాకు చాలా పోలికలున్నాయి. ఇద్దరం ప్రశాంతంగా ఉంటాం. దక్షిణాఫ్రికాలో ఉన్న పరిస్థితుల వల్ల కెప్టెన్​ అంటే నాకు ఒక రకమైన అభిప్రాయం ఉండేది. ధోనీ సారథ్యంలో సీఎస్​కేలో ఆడిన తర్వాత అది పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి కెప్టెన్సీ వైవిధ్యంగా ఉంటుందని.. ఎవరి శైలిలో వారు ప్రయత్నించాలని అర్థమైంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనలా మనం ఉండటమే కీలకం. కాబట్టి కోహ్లీలా, ధోనీలా ఉండాలని నేను అనుకోను. అయితే వారి నుంచి నేర్చుకున్న విషయాలు నా కెప్టెన్సీకి చాలా ఉపయోగపడతాయి.

- ఫాఫ్​ డుప్లెసిస్​​, ఆర్​సీబీ కొత్త కెప్టెన్​

విరాట్​ నీడలా వెన్నంటే ఉంటాడు..

"ఆర్​సీబీ లాంటి పెద్ద ఫ్రాంఛైజీలో ఆడటం నా అదృష్టం. కెప్టెన్​గా నన్ను ప్రకటిస్తూ విరాట్ చేసిన పోస్ట్​ ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతడో గొప్ప సారథి. అతడు నాకు నీడలా ఉంటాడు. పరస్పర సహకారంతో జట్టును నడిపిస్తాం." అని డుప్లెసిస్ చెప్పాడు.

ఈసారి జరిగిన ఐపీఎల్ 2022 మెగావేలంలో డుప్లెసిస్​ను ఆర్​సీబీ ఫ్రాంచైజీ రూ.7కోట్లకు సొంతం చేసుకుంది. 37 ఏళ్ల డుప్లెసిస్​ 2012 నుంచి గత సీజన్​ వరకు చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టులో ఆడాడు. ఈ సీజన్​లో బెంగళూరు తన తొలి మ్యాచ్​లో​ మార్చి 27న ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది.
ఇదీ చదవండి:IPL 2022: ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​లు పట్టింది వీరే..

ABOUT THE AUTHOR

...view details