కెప్టెన్, కీపర్, బ్యాట్స్మన్.. ఇలా ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేసిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). ఆటతోనే కాదు ఆహార్యంలోనూ అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశలో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఈ సీఎస్కే సారథి.. తాజాగా సరికొత్త లుక్తో దర్శనమిచ్చాడు. ఈ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది.
కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టుతో కనిపించిన ధోనీ.. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన వేషధారణ పూర్తిగా మార్చేశాడు. కొంతకాలం చిన్న హేర్తో కొత్తగా కనిపించాడు. గతంలో సన్యాసి వేషధారణలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు మహి. గుండు కొట్టించుకుని బౌద్ద సన్యాసి లాగా మారాడు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో కుర్రాళ్లకు బాగా ఇష్టమైన హేర్స్టైల్లో దర్శనమిచ్చాడు.