టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) టీమ్‌ఇండియా తరఫున మార్గనిర్దేశకుడు ధోని(Dhoni Mentor), కెప్టెన్ విరాట్ కోహ్లీల జోడీ అద్భుతాలు చేయడం ఖాయమని సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad on Dhoni) అభిప్రాయపడ్డాడు. ధోని సేవలు వినియోగించుకోవాలని భావించడం గొప్ప నిర్ణయమని తెలిపాడు.
"బీసీసీఐ మంచి పని చేసింది. టీమ్‌ఇండియాకు ధోనీని మార్గనిర్దేశకుడిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయం. ధోని, రవిశాస్త్రిలతో విరాట్‌కు మంచి సమన్వయం ఉంది. ధోని సారథ్యంలో కోహ్లి ఎక్కువకాలం ఆడాడు. రవిశాస్త్రి కోచ్‌గా విరాట్ ఎన్నో సిరీస్‌లు నెగ్గాడు. వ్యూహాల్లో ధోని భాగస్వామ్యం జట్టును మరింత బలంగా తయారు చేస్తుంది. క్రికెట్లో ధోని అపర మేధావి. పొట్టి కప్పులో టీమ్‌ఇండియా తరఫున ధోని, కోహ్లీల జోడీ అద్బుతాలు చేస్తుంది" అని ఎమ్మెస్కే చెప్పాడు.