MS Dhoni 15 Crore Case:టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన బిజినెస్ పార్ట్నర్లు మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌పై రాంచిలో క్రిమినల్ కేసు పెట్టాడు. వీరిద్దరి వల్ల తను రూ.15 కోట్లు నష్టపోయినట్లు ధోనీ కంప్లైంట్లో పేర్కొన్నాడు.
ఇదీ జరిగింది
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు 2017లో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్తో ధోనీకి ఒప్పందం కుదిరింది. అయితే ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో భాగమైన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ షరతులను పాటించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఫీ, ఫ్రాంచైజీ లాభాల్లో ధోనీకి రావాల్సిన వాటా కూడా చెల్లించలేదు. దీనిపై ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్కు ధోనీ 2021లో లీగల్ నోటీసులు పంపించాడు. కానీ, మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ధోనీ తాజాగా రాంచీ కోర్టును ఆశ్రయించాడు. ఆర్కా స్పోర్ట్స్ కారణంగా రూ.15 కోట్లు నష్టపోయినట్లు విధి అసోసియేట్స్ బాధ్యతలు చూసుకునే దయానంద్ సింగ్ పేర్కొన్నాడు. ఇక, దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ధోనీ ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చారు.
MS Dhoni Defamation Case: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల వార్తల్లో నిలిచారు. ధోనీ వేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఐపీఎస్ అధికారికి మద్రాస్ కోర్టు గత డిసెంబర్లో 15 రోజుల జైలు శిక్షను విధించింది. సంపత్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.