IPL 2022: ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగులు ఉన్నా ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. ఏటా ఆటగాళ్ల వేలం నుంచి టోర్నీ పూర్తయ్యేవరకు అద్భుతమైన ఆదరణ కలిగిన నంబర్ వన్ ఈవెంట్‌గా దీనికి గుర్తింపు ఉంది. అది డబ్బు పరంగా అయినా, ఆటగాళ్లకు దక్కే ఫేమ్ పరంగా చూసినా దీనికి మరే లీగ్ సాటిరాదు. అలాంటి టోర్నీలో రాబోయే సీజన్‌కు జరిగిన మెగా వేలంలో పలువురు ఆటగాళ్లు ఊహించని ధర పలికారు. అందులో ఎవరున్నారో.. వారికి అంత మొత్తం ఎందుకు దక్కిందో తెలుసుకుందాం.
వయసుతో పాటు టాలెంట్..
ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు నెలకొల్పాడు. ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో వేలంలో అత్యధిక ధర పలికిన టీమ్ఇండియా రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇదివరకు యువరాజ్ సింగ్‌ను దిల్లీ టీమ్ అత్యధికంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2018లో ముంబయి రూ.6.4 కోట్లకు ఇషాన్‌ను కొనుగోలు చేయగా ఈసారి అంత మొత్తం వెచ్చించడానికీ కారణాలు లేకపోలేదు. అతడి వయసు ఇప్పుడు 23 ఏళ్లు ఉండగా.. గతకొన్నేళ్లుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా రాణిస్తున్నాడు. దూకుడు కలిగిన బ్యాట్స్‌మన్ కావడంతో పాటు వయస్సులో చిన్నవాడు కావడంతో ఇషాన్‌ను తీసుకోడానికి ముంబయి సిద్ధపడింది. దీంతో అతడిని భవిష్యత్ నాయకుడిగానూ తీర్చిదిద్దొచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది.
బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్..
ఈ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడు దీపక్ చాహర్. అతడిని వదిలేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టే తిరిగి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 2016, 17 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ధోనీ సారథ్యంలోనే ఆడిన చాహర్ 2018లో రూ.80లక్షలకు చెన్నై గూటికి చేరాడు. దీంతో అప్పటి నుంచి ఆ జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, చాహర్ పవర్‌ప్లేలో వికెట్లు తీసే బౌలర్ మాత్రమే కాకుండా లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉన్న ఆటగాడు. అందువల్లే చెన్నై టీమ్ చాహర్‌ను వేలంలో పోటీ పడి కొనుగోలు చేసింది. కాగా, రూ.2 కోట్ల కనీస ధరతో మెగా వేలంలో అడుగుపెట్టిన చాహర్‌ను సొంతం చేసుకోడానికి సన్‌రైజర్స్, దిల్లీ జట్లు తొలుత ఆసక్తి చూపాయి. అతడి కోసం పోటాపోటీ నెలకొనగా రూ.10 కోట్ల ధర దాటగానే చెన్నై వేలంలోకి వచ్చింది. దీంతో చివరికి అతడిని సొంతం చేసుకొని అత్యధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది.
అనుభవంతో పాటు కెప్టెన్సీ..