తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రూట్‌ను ఈ ప్రణాళికతో ఔట్ చేయండి' - Ind vs Eng

ఆతిథ్య జట్టులో టీమ్‌ఇండియాకు అడ్డొస్తున్న రూట్​ను ఔట్​ చేయడం ఎలాగో చెప్పాడు ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.. రూట్​పై ఒత్తిడి పెంచగలరని అభిప్రాయపడ్డాడు.

root, england player
రూట్, ఇంగ్లాండ్ ప్లేయర్

By

Published : Aug 19, 2021, 5:31 AM IST

ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ వెల్లడించాడు. అతడు క్రీజులోకి రాగానే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌తో బౌలింగ్‌ చేయించాలని సూచించాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల, నాలుగు లేదా ఐదో స్టంప్‌ లైన్‌లో బంతులు వేయాలని అంటున్నాడు.

"జో రూట్‌ను ఔట్‌ చేయాలంటే ఆఫ్‌స్టంప్‌ ఆవల, ఐదో స్టంప్‌ లైన్‌లో బంతులు వేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ ఇదే ప్రణాళిక వేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా దానిని చక్కగా అమలు చేశాడు. తర్వాత మ్యాచుల్లోనూ విరాట్‌ ఇదే ప్రణాళిక అమలు చేయాలి. ఎందుకంటే రూట్‌ పుల్‌ షాట్‌ అద్భుతంగా ఆడగలడు. అందుకే షార్ట్‌ పిచ్‌ బంతులు వేయొద్దు" అని పనేసర్‌ తెలిపాడు.

ఆతిథ్య జట్టులో టీమ్‌ఇండియాకు అడ్డొస్తున్నది రూట్‌ ఒక్కడే. ఈ సిరీసులో జరిగిన రెండు మ్యాచుల్లో అతడు ఏకంగా రెండు శతకాలు, ఒక అర్ధశతకం చేశాడు. 128.66 సగటుతో 386 పరుగులు సాధించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో అతడు అజేయంగా నిలిచాడు.

సిరాజ్, బుమ్రా

జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌కు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడి చేయగల నైపుణ్యాలు ఉన్నాయని మాంటీ ప్రశంసించాడు. వీరిద్దరూ రూట్‌ను అడ్డుకోగలరని తెలిపాడు. "రూట్‌ క్రీజులోకి రాగానే విరాట్‌ మరో ఆలోచన లేకుండా బుమ్రాను ప్రయోగించాలి. సిరాజ్‌ కూడా అతడిపై ఒత్తిడి తేగలడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఇలాగే చేశాడు. దాంతో రూట్‌ వికెట్ ఇచ్చేశాడు. రూట్‌ తన పొజిషన్‌ మార్చుకొనేలా చికాకు పెట్టాలి. అతడి జోరును అడ్డుకోవాలి. అలా చేస్తే అతడు పొజిషన్‌ మార్చుకొంటాడు. త్వరగా వికెట్‌ ఇచ్చేస్తాడు" అని పనేసర్‌ వివరించాడు.

ఇదీ చదవండి:కసితో ఇంగ్లాండ్.. మూడో టెస్టు జట్టులో భారీ మార్పులు

ABOUT THE AUTHOR

...view details