టీమ్ఇండియాపై కెప్టెన్ కోహ్లీ కంటే ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రభావమే ఎక్కువ అని.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది అంటే అది రవిశాస్త్రి వల్లేనని తెలిపాడు. టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో శాస్త్రి సఫలమయ్యాడని పేర్కొన్నాడు.
"గత కొన్ని నెలలుగా టీమ్ఇండియా గొప్పగా రాణిస్తోంది. ప్రస్తుత జట్టుపై కోహ్లీ కంటే రవిశాస్త్రి ప్రభావం ఎక్కువగా ఉంది. అతడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్టులో 36పరుగులకే ఆలౌటైంది కోహ్లీసేన. కోహ్లీ స్వదేశానికి పయనమయ్యాడు. గాయాలతో చాలా మంది ప్లేయర్లు దూరమయ్యారు. అయినప్పటికీ సిరీస్‌ను టీమ్ఇండియా గెలిచింది. దీన్ని బట్టి తెరవెనక శాస్త్రి కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు."
-మాంటీ పనేసర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.
ఇరు జట్లకు అవకాశాలు..