టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలోనే కాక బయట దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. ఆట మధ్యలో తన స్టెప్పులతో అలరిస్తుంటాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా లార్డ్స్ బాల్కనీలో నాగిని డ్యాన్స్ చేస్తూ (Kohli Dance) కనిపించాడు. విరాట్ స్టెప్పులు సహచర ఆటగాళ్లనే కాకుండా క్రీడాభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Kohli Dance: కెప్టెన్ కోహ్లీ 'నాగిని' డ్యాన్స్! - లార్డ్స్ బాల్కనీలో కోహ్లీ డ్యాన్స్
లార్డ్స్ టెస్టు సందర్భంగా బాల్కనీలో నాగిని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Kohli Dance). సహచర ఆటగాళ్లు అతడి స్టెప్పులను ఎంజాయ్ చేశారు!
లార్డ్స్‌లో విరాట్ కోహ్లీ స్టెప్పులు
గత కొద్దికాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న కోహ్లీ.. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. మొత్తంగా టీమ్ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. బదులుగా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
ఇదీ చదవండి:ఫార్మల్ డ్రెస్‌లో కోహ్లీ అదిరేటి స్టెప్పులు