యువ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed siraj) విజయంలో టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు భాగముందని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అన్నారు. హైదరాబాద్‌కు కోచింగ్ ఇస్తున్నప్పుడు అతడే సిరాజ్‌ను గుర్తించాడని తెలిపారు. త్వరలోనే అతడు పెద్ద స్టార్ అవుతాడని వెల్లడించారు.
'సిరాజ్ విజయంలో భరత్ అరుణ్‌కు భాగం ఉంది. ఒకట్రెండేళ్లు హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నప్పుడు అతడే సిరాజ్‌ను గుర్తించాడు. ఇక ఈ యువ పేసర్లో నేర్చుకొనే తపన, విజయవంతం అవ్వాలన్న ఆకలి ఎక్కువే. భరత్ అతడికి ఎంతో విజ్ఞానం అందించాడు' అని శివరామకృష్ణన్ తెలిపారు.
సిరాజ్ గురువును ఏ మాత్రం సంకోచించకుండా నమ్ముతాడని లక్ష్మణ్ వివరించారు. 'నిజం చెప్పాలంటే సిరాజ్ కేవలం భరత్‌ను అనుసరించాడంతే. కొంతమంది అనుమానిస్తారు. కోచ్ చెప్పింది సరైందేనా? పని జరుగుతుందా? అని సందేహిస్తారు. సిరాజ్ మాత్రం అలాకాదు. భరత్‌ను గురువుగా భావించాడు. అతడు చెప్పిన ప్రతిదీ చేశాడు. ఈ విషయం భరత్ కచ్చితంగా రవిశాస్త్రికి చెప్పే ఉంటాడు' అని శివరామకృష్ణన్ అన్నారు.
స్వల్ప కాలంలోనే సిరాజ్ భారత క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. మొదట్లో భావోద్వేగం, సరిగ్గా ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్ల వెనకబడ్డాడు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా సిరీసులో అదరగొట్టాడో అతడి స్థాయి మారిపోయింది. అదే ప్రదర్శనను ఐపీఎల్‌లో చేశాడు. అట్నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చి దుమ్మురేపుతున్నాడు.
ఇదీ చదవండి :Rohit Sharma: 'టెస్టు కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో రోహిత్'