తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాటిల్​ విసిరి ఫ్యాన్స్ ఎగతాళి.. అదిరే పంచ్​ ఇచ్చిన సిరాజ్ - siraj latest news

తనపై బాటిల్ విసిరి, స్కోరు ఎంత ఎగతాళి చేసిన ప్రేక్షకులకు అదిరిపోయే రీతిలో సమాధానమిచ్చాడు భారత బౌలర్ సిరాజ్. ఇంతకీ మైదానంలో ఏం జరిగిందంటే?

Mohammed Siraj mocks England supporters
సిరాజ్

By

Published : Aug 26, 2021, 8:13 AM IST

ఇంగ్లాండ్​తో తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్​ఇండియా లీడ్స్​లో జరుగుతున్న మూడో మ్యాచ్​లో ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్​లో బ్యాట్స్​మెన్ చేతులెత్తేయడం వల్ల తొలిరోజు 78 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​.. వికెట్లేమి కోల్పోకుండా 120 పరుగుల చేసింది. దీంతో స్టేడియంలోని ఆతిథ్య జట్టు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

సిరాజ్​పై బాటిల్ విసిరారు!

తమ జట్టు బాగా ఆడుతుంటడం వల్ల ఇంగ్లాండ్​ ఫ్యాన్స్​ అదుపుతప్పారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్టింగ్ చేస్తున్న సిరాజ్​పైకి పింక్ కలర్​ ప్లాస్టిక్ బాటిల్​ను విసిరారు. అయితే అది అతడికి కొంచెం దూరంలో పడింది.

సైగలతో సిరాజ్​ పంచ్​

అలానే సిరాజ్​ను ఉద్దేశించి స్కోరు స్కోరు ఎంత? అంటూ ఇంగ్లాండ్​ అభిమానులు కొందరు గోల చేశారు. దీనికి అదే రీతిలో బదులిచ్చిన సిరాజ్.. 1-0 అంటూ చేతులతో సంజ్ఞ చూపించాడు. ఇప్పటికే ఓ టెస్టు గెలిచిన భారత్.. ఈ టెస్టు సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

రెండో రోజు ఏం చేస్తారో?

అయితే తొలిరోజు తేలిపోయిన భారత బౌలర్లు షమి, బుమ్రా, ఇషాంత్, సిరాజ్.. రెండో రోజు ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికే 42 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్​ను త్వరగా కట్టడి చేయాలి. లేదంటే మ్యాచ్​ విజయంపై ఆశలు సన్నగిల్లే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details