తెలంగాణ

telangana

ETV Bharat / sports

'షమి 'మణికట్టు' పొజిషన్.. ప్రపంచంలోనే ది బెస్ట్' - షమి ఐపీఎల్

పేసర్ షమి మణికట్టు పొజిషన్​ అత్యుత్తమమని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అలానే ప్రస్తుతమున్న వారిలో షమి అద్భతు బౌలర్ అని చెప్పాడు.

shami
షమి

By

Published : Dec 30, 2021, 9:48 PM IST

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్ షమి అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి సఫారీ జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ(3/63) మంచి ప్రదర్శన చేశాడు. ఇదే క్రమంలో టెస్టు కెరీర్‌లో 200వ వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా.. షమిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

షమి మణికట్టు పొజిషన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుందని పేర్కొన్నాడు. అతడిని దిగ్గజ బౌలర్లు జేమ్స్ అండర్సన్, డేల్ స్టెయిన్‌లతో పోల్చాడు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బౌలర్లలో షమి ఒకడని పేర్కొన్నాడు.

మహమ్మద్ షమి

'మహ్మద్ షమి మణికట్టు పొజిషన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమం. నేను ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. కానీ, మణికట్టు ఉపయోగించి షమి అద్భుతమైన బంతులను విసురుతున్నాడు. ప్రతి ఒక్కరి మణికట్టు ఒక్కోసారి దెబ్బతినడం మనం చూశాం. గొప్ప బౌలర్లయిన డేల్ స్టెయిన్, అండర్సన్ కూడా ఇలా జరిగింది. కానీ, షమి మణికట్టు దెబ్బతినడం నేనెప్పుడూ చూడలేదు. అతని బ్యాక్‌స్పిన్‌ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బౌలర్లలో షమి ఒకడు' అని ఆకాశ్​చోప్రా వివరించాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడనందున వారి బౌలింగ్‌ గాడి తప్పిందని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. షమి కూడా ఈ సిరీస్‌కు ముందు టీ20 ప్రపంచకప్‌లో ఆడాడని, అయితే అతడు టెస్టు మ్యాచ్ సాధనకు దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని చెప్పాడు..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details