తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2022, 10:13 AM IST

Updated : Dec 3, 2022, 11:41 AM IST

ETV Bharat / sports

బంగ్లాదేశ్​తో సిరీస్​.. టీమ్​ఇండియాకు భారీ షాక్​.. సీనియర్​ పేసర్​ దూరం!

బంగ్లాదేశ్​తో సిరీస్​కు ముందు టీమ్​ఇండియాకు పెద్ద షాకే తగిలింది. ఈ సిరీస్​కు సీనియర్​ పేసర్​ గాయం కారణంగా దూరమయ్యాడు.

Mohammed shami ruled out of bangladesh ODI series
బంగ్లాదేశ్​తో సిరీస్​.. టీమ్​ఇండియాకు భారీ షాక్​.. సీనియర్​ పేసర్​ దూరం!

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు టీమ్​ఇండియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్​ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా అతడు గాయపడ్డాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు జట్టులో చోటు కల్పించినట్లు వెల్లడించింది.

"టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో షమీ చేతికి గాయమైంది. అతడు ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లే టీమ్‌తో అతడు వెళ్లలేదు" అని బీసీసీఐ తెలిపింది. అయితే అతడి గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియరాలేదు.

షమీకి దాదాపు రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్నాడట. అయితే అతడు వన్డే సిరీస్‌తోపాటు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కూ షమీ దూరమయ్యే అవకాశాలు ఉండటం ఇప్పుడు జట్టులో ఆందోళన కలిగిస్తోంది. 'వన్డే సిరీస్‌కు షమీ లేకపోవడం పెద్ద లోటే. అయితే.. బుమ్రా గైర్హాజరిలో టెస్టు సిరీస్‌కూ అతడు దూరమైతే ఇది అంతకంటే పెద్ద ఆందోళనే' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఎందుకంటే జూన్‌లో ఓవల్‌లో జరగబోయే ప్రపంచకప్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ రేసులో ఉండాలంటే.. టీమ్‌ ఇండియా ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన అవసరం ఉంది. షమీ ఇప్పటి వరకూ 60 టెస్టు మ్యాచ్‌ల్లో 216 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

బంగ్లాతో వన్డేలకు టీమ్‌ఇండియా జట్టు ఇదే..: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైఎస్‌ కెప్టెన్‌), ధావన్‌, కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), షాబాజ్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

ఇదీ చూడండి:'రోహిత్‌, ధావన్‌కు అతడు ప్రత్యామ్నాయం.. ఆ సమస్యకు పరిష్కారం చూపాలి'

Last Updated : Dec 3, 2022, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details