తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా ప్లేస్​లో జట్టులోకి వచ్చిన స్టార్​ బౌలర్.. ఆశలు నెరవేరుస్తాడా? - టీ20 వరల్డ్​ కప్​ ఆస్ట్రేలియా

T20 World Cup : మెగా టోర్నీ ముందు భారత జట్టు గాయాలతో ఇబ్బందులు పడుతోంది. జడేజా, బుమ్రా లాంటి స్టార్​ ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. అయితే బుమ్రా ప్లేస్​లో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. వీటన్నిటికీ తెరదించుతూ ఈ స్టార్​ బౌలర్​ పేరును ప్రకటించింది బీసీసీఐ.

T20 World Cup
T20 World Cup

By

Published : Oct 14, 2022, 5:17 PM IST

Updated : Oct 14, 2022, 9:04 PM IST

T20 World Cup :టీ20 ప్రపంచకప్​కు ముందు భారత క్రికెట్​ జట్టు గాయాలతో సతమతమౌతోంది. జస్​ప్రీత్​ బుమ్రా, జడేజా వంటి ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. అయితే జడేజా స్థానంలో అక్షర్​ పటేల్ రాణిస్తాడని విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా అక్షర్​ మంచి ప్రదర్శనే చేస్తున్నాడు. అయితే స్టార్ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న చర్చ జరిగింది. మహ్మద్​ సిరాజ్​ అయితే బాగుంటుందని కొందరు విశ్లేషించారు. మరికొందరు బుమ్రా స్థానాన్ని మహ్మద్ షమీ భర్తీ చేయగలడని అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నిటికీ తెరదించుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బుమ్రా స్థానంలో మహ్మద్​ షమీని జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేసింది.

"ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్​ కప్​లో జస్​ప్రీత్ బుమ్రాకు రిప్లేస్​మెంట్​గా మహ్మద్​ షమీని ఆల్​ ఇండియా సెలెక్షన్​ కమిటీ జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. వార్మప్​ మ్మచ్​కు ముందు బ్రిస్బేన్​లో జట్టుతో కలుస్తాడు" అని బీసీసీఐ తెలిపింది.
మహ్మద్​ సిరాజ్​, శార్దుల్​ ఠాకూర్​ను బ్యాక్​అప్​గా జట్టులోకి తీసుకున్నారు. వీరు త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. షమీకి గత టీ20 వరల్డ్ కప్​లో ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన 6 టీ20 మ్యాచ్​ల్లో షమీ ఆడాలి. కానీ కొవిడ్​ సోకడం వల్ల షమీ ఆడలేకపోయాడు.

టీ20 వరల్డ్​ కప్​ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్​ రాహుల్(వైస్​ కెప్టెన్), విరాట్​ కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్, దీపక్ హుడా, రిషబ్​ పంత్(వికెట్​ కీపర్), దినేశ్​ కార్తీక్(వికెట్​ కీపర్), హార్దిక్ పాండ్య, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్​ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్​ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ.

ఇవీ చదవండి:T20 worldcup: అన్ని లక్షల టికెట్లు అమ్ముడైపోయాయా?

భారత క్రికెట్​ బోర్డుకు రూ.995 కోట్లు నష్టం.. ఇదే కారణం!

Last Updated : Oct 14, 2022, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details