Mohammed Shami Brother Bengal Vs Andhra Pradesh Ranji Trophy 2024 : టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా తాజాగా ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు 3 వికెట్లు తీసి అదరగొట్టాడు.
మహ్మద్ కైఫ్‌కు ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే అతడు తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కవలం 62 పరుగులే సమర్పించుకుని 3 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఆంధ్ర, బెంగాల్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అయితే ఈ మ్యాచ్‌తో రంజీ ట్రోఫీ తాజా(2024) సీజన్‌లో ఆంధ్ర శుభారంభం చేసింది. మూడు పాయింట్లతో బోణీ కొట్టింది. రికీ భుయ్ (347 బంతుల్లో 175; 23×4, 1×6), షోయబ్‌ఖాన్ (149 బంతుల్లో 56; 7×4, 1×6) మంచిగా రాణించడం వల్ల బెంగాల్‌తో ముగిసిన ఈ ఎలీట్ గ్రూపు-బి మ్యాచ్‌లో ఆంధ్ర పైచేయి సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 339/6తో నాలుగో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది ఆంధ్ర. అలా 165.4 ఓవర్లలో 445 పరుగుల చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆంధ్రకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రికీ భుయ్, షోయబ్‌ఖాన్ ఏడో వికెట్‌కు 133 పరుగులు జోడించడం వల్ల టీమ్‌కు ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 36 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ మ్యాచ్ ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 25 ఓవర్లలో 82 పరుగులు చేసింది. ఇక రిజల్ట్ తేలే అవకాశం లేకపోవడం వల్ల ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు ఓకే అన్నారు. అలా ఆంధ్రకు మూడు పాయింట్లు రాగా, బెంగాల్‌కు ఒక పాయింట్ దక్కింది. బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌట్ అయింది.
2024 రంజీలో బ్యాటర్లు అదరహో- అందరి టార్గెట్ అదే!
రోహిత్ కామెంట్స్‌పై ఐసీసీ గరం!- చిక్కుల్లో కెప్టెన్?