తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరాజ్​ 'మంచి' మనసు.. విండీస్​ యువ క్రికెటర్లకు స్పెషల్​​​ గిఫ్ట్స్​.. ఏం ఇచ్చాడంటే? - వెస్టిండీస్​ టెస్టు ఇండియా స్క్వాడ్​

Mohd Siraj Gifts : టీమ్​ఇండియా బౌలర్​ మహమ్మద్​ సిరాజ్​.. విండీస్​​ యువ క్రికెటర్లకు ఎవరు ఊహించని గిఫ్ట్స్​ ఇచ్చాడు. ఇంతకీ ఏం ఇచ్చాడో తెలుసా?

Mohammad Siraj gave his bat and shoe to young players of West Indies
విండీస్​ యువ క్రికెటర్లకు మహ్మద్​ సిరాజ్​ సర్రైజ్​ గిఫ్ట్స్​.. ఏం ఇచ్చాడంటే..

By

Published : Jul 7, 2023, 7:49 PM IST

Updated : Jul 7, 2023, 8:29 PM IST

Mohd Siraj Gifts : జులై 12 నుంచి వెస్టిండీస్​తో టీమ్​ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అందులో భాగంగా ఇప్పటికే విండీస్​ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు జరగబోయే టోర్నీల్లో పాల్గొనేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాక్టీస్​ మ్యాచులను కూడా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే బార్బడోస్​ మైదానంలో ఉన్న కొందరు వెస్టిండీస్​ యువ ఆటగాళ్లు భారత క్రికెటర్లతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా హైదరాబాదీ యువ ఆటగాడు మహ్మద్​ సిరాజ్​ వారికి సర్ప్రైజింగ్​ గిఫ్ట్స్​గా బ్యాట్​, షూస్​​ ఇచ్చి ఖుషీ చేశాడు. అంతేగాక ఆటకు సంబంధించి తన విలువైన సలహాలు, సూచనలను కూడా వారితో పంచుకున్నాడు ఈ హైదరాబాదీ కుర్రాడు.

సెల్ఫీలు.. ఆపై సూచనలు..
West Indies Tour : మరోవైపు మైదానంలో ఉన్న సిరాజ్​, ఇషాన్​ కిషన్​, కెప్టెన్​ రోహిత్​ శర్మ, రుతురాజ్​ గైక్వాడ్​, సూర్యకుమార్​ యాదవ్, అజింక్యా రహానే​తో పాటు మరికొంత మంది భారత ఆటగాళ్లతో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్​ బ్యాటింగ్​లో, రవిచంద్రన్​ అశ్విన్​ బౌలింగ్​లో అప్​కమింగ్​ కరీబియన్​ ప్లేయర్స్​కు సలహాలు సూచనలు ఇచ్చారు. ఇక కింగ్​ విరాట్​ కోహ్లీ, అక్షర్​ పటేల్​లతో మాత్రం కొందరు క్రికెట్​ లవర్స్​ టీ-షర్ట్​లపై ఆటోగ్రాఫ్​ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్టర్​లో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వీడియోలో సిరాజ్​ చేసిన పనిని చూసిన కొందరు నెటిజన్స్​ అతడిని మెచ్చుకుంటున్నారు. హైదరాబాదీ కుర్రాడు మంచి మనసు చాటుకున్నాడంటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఈసారి యంగ్​ ప్లేయర్లకు..
West Indies Tour India Squad : వరల్డ్ కప్​ ముగింట సిరీస్ కావడంతో.. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఈ మూడు సిరీస్​లను ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ మూడు సిరీస్​లలో టెస్ట్ సిరీస్​, వన్డేకు మాత్రం రోహిత్ శర్మను కెప్టెన్​గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. టీ20 సీరీస్​కు మాత్రం సీనియర్ క్రికెటర్​లకు బ్రేక్​ ఇచ్చింది. ఈ టోర్నీలో యంగ్​ ప్లేయర్స్​కు అవాకాశాన్ని కల్పించింది.

వన్డే, టెస్టు జట్టు..
West Indies ODI Test Team India Squad :రోహిత్​ శర్మ(కెప్టెన్​), శుభ్​మన్​ గిల్​, రుతురాజ్​ గైక్వాడ్​, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్​, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్​), కేఎస్​ భరత్​, ఇషాన్​ కిషన్​, రవిచంద్రన్​ అశ్విన్​తో పాటు మరికొంతమంది సీనియర్​ ఆటగాళ్లు టెస్టు, వన్డే జట్టులో ఉన్నారు.

టీ20 స్క్వాడ్​..
West Indies T20 Team India Squad : హార్దిక్​ పాండ్యా(కెప్టెన్​), ఇషాన్​ కిషన్​, శుభ్​మన్​ గిల్​, యశస్వి జైస్వాల్​, తిలక్ వర్మ, సూర్య కుమార్​ యాదవ్​, సంజూ శాంసన్​, అక్షర్​ పటేల్​, యుజ్వేంద్ర చాహల్​, కుల్దీప్​ యాదవ్​, రవి బిష్ణోయ్​, అర్షదీప్​ సింగ్​, ఉమ్రాన్ మాలిక్​, అవేశ్​ ఖాన్​, ముఖేశ్​ కుమార్​.

Last Updated : Jul 7, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details