తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​ పట్టిందల్లా బంగారమే'- కెప్టెన్​పై ప్రశంసల వర్షం - రోహిత్​ శర్మ కెప్టెన్సీ

Rohit Sharma Captaincy: మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్​ శర్మపై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్. రోహిత్​ పట్టిందల్లా బంగారమే అని వ్యాఖ్యానించాడు.

rohit sharma
రోహిత్​ శర్మ

By

Published : Feb 27, 2022, 3:58 PM IST

Updated : Feb 27, 2022, 5:11 PM IST

Rohit Sharma Captaincy: టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు మాజీ క్రికెటర్ మహ్మద్​ కైఫ్​. రోహిత్​ పట్టిందల్లా బంగారమే అని.. అతనితో కరచాలనం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ చమత్కరించాడు. విరాట్​ కోహ్లీ గైర్హాజరుతో యువ క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​ను మూడో స్థానంలో బరిలోకి దింపాలన్న రోహిత్​ నిర్ణయాన్ని కైఫ్​ సమర్థించాడు. "జట్టు కూర్పు, బౌలింగ్​ అన్ని మారాయి. అమలు చేస్తున్న ప్రతీ వ్యూహం ఒక మాస్టర్​స్ట్రోక్​" అని పేర్కొన్నాడు. ఈ మేరకు కైఫ్​ ట్వీట్​ చేశాడు.

రోహిత్​ సారథ్యంలో టీమ్​ఇండియా వరుస విజయాలు సాధిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్​, విండీస్​లతో జరిగిన టీ20ల్లో ప్రత్యర్థులను వైట్​వాష్​ చేసింది. ఆదివారం జరగనున్న మూడో టీ20లో విజయం సాధించి శ్రీలంకను కూడా వైట్​వాష్​ చేయాలని జట్టు భావిస్తోంది. ఈ టీ20 గెలిస్తే అఫ్గానిస్థాన్​ పేరున ఉన్న వరుస టీ20 విజయాల రికార్డును టీమ్​ఇండియా సమం చేస్తుంది.

'నాకు ఆ స్వేచ్ఛ ఇస్తాడు'

స్టార్​ బౌలర్​ బుమ్రా కూడా రోహిత్​పై ప్రశంసలు కురిపించాడు. తన తొలినాళ్లలో రోహిత్​ అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు.

"నా తొలినాళ్ల నుంచి మా మధ్య మంచి బంధం ఉంది. రికీ పాంటింగ్​ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​కు ఎంపికైనప్పుడు నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. రోహిత్​ పగ్గాలు తీసుకున్నాకే నేను ఎక్కువగా ఆడాను. కీలకమైన ఓవర్లలో నాకు బౌలింగ్​ ఇచ్చేవాడు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను బౌలింగ్​ చేస్తున్నప్పుడు నన్నే ఫీల్డింగ్​ కూర్పు చేసుకోమనేవాడు."

-బుమ్రా, టీమ్​ఇండియా బౌలర్

స్పిన్నర్​ అశ్విన్​ యూట్యూబ్​ ఛానెల్​లో జరిగిన ఇంటర్వ్యూలో బుమ్రా ఈ విషయాలు వెల్లడించాడు.

రోహిత్​కు థ్యాంక్స్​..

రెండో టీ20లో వేగంవతమైన ఇన్నింగ్స్​తో చెలరేగిన జడేజా మ్యాచ్​ అనంతరం రోహిత్​కు ధన్యవాదాలు తెలిపాడు.

"ఈ సందర్భంగా నేను రోహిత్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మిడిల్‌ ఆర్డర్‌లో నన్ను బరిలోకి దింపి జట్టు కోసం పరుగులు చేస్తానని ఎంతో నమ్మకం ఉంచాడు. అందుకే అతడికి కృతజ్ఞతలు చెబుతున్నా. భవిష్యత్‌లో నాకెప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికే కృషి చేస్తా"

-రవీంద్ర జడేజా, టీమ్​ఇండియా ఆల్​రౌండర్

ఇదీ చూడండి :ఆస్పత్రిలో ఇషాన్​ కిషన్, చండీమాల్​.. మూడో టీ20కు అనుమానమే!

Last Updated : Feb 27, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details