Hafeez about Rohit Kohli: పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించకపోతే టీమ్ఇండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాక్‌తో కలిసి భారత్ ఒకే గ్రూప్‌లో తలపడనుంది. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. తాజాగా ఇదే విషయంపై హఫీజ్ మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు.
"పాకిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ భారీగా పరుగులు చేయకపోతే టీమ్‌ఇండియా ఒత్తిడిలో పడిపోతుంది. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నా ఎక్కువగా వీరిద్దరిపైనే భారత్ ఆధారపడుతోంది. పాక్ వంటి టీమ్‌తో ఆడేటప్పుడు ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీరిద్దరూ ఆడకపోతే ఇతర టీమ్ఇండియా ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవు. అయితే మిగతావారిని తక్కువగా అంచనా వేయడం లేదు."