సస్పెన్షన్‌కు గురైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్.. బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘం నుంచి గతంలో సస్పెండైన జాన్ మనోజ్, విజయానంద్, నరేష్ శర్మ జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చి అక్కడి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని, తనను సైతం వేధిస్తున్నారని అజహర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాళ్లు నన్ను బెదిరిస్తున్నారు: హెచ్సీఐ అధ్యక్షుడు అజహరుద్దీన్ - HCA issue
హైదరాబాద్ క్రికెట్ సంఘం నుంచి సస్పెండ్ అయిన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారని సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
అజహరుద్దీన్