టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్. ఓ టర్కిష్ టీవీ సిరీస్‌లోని పాత్రధారి ఫొటోను జతచేస్తూ.. "బ్రదర్ ఇది మీరేనా? నేను తేల్చుకోలేకున్నా" అని నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్ చేశాడు. ఆ చిత్రంలో పాత్రధారి కోహ్లీని పోలి ఉండటం వల్ల ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపాడు అమీర్.
టీవీ సిరీస్‌లో నటించిన విరాట్ కోహ్లీ! - batting maestro virat kohli
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఓ టీవీ సిరీస్‌లోని పాత్రధారి ఫొటోను షేర్ చేస్తూ.. తను కోహ్లీలా ఉన్నాడని అన్నాడు.
టీవీ సిరీస్‌లో నటించిన టీమ్ఇండియా కెప్టెన్!
బ్యాటింగ్ మాస్ట్రో కోహ్లీ
అమీర్, కోహ్లీ మైదానంలో ప్రత్యర్థులే అయినా.. బయట ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటారు. 2016లో కోల్‌కతా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ కంటే ముందు అమీర్‌కు కోహ్లీ తన బ్యాట్‌ను బహుకరించాడు. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన 'స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్' పురస్కారాన్ని గెలుచుకున్న కోహ్లీపై అమీర్ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ మాస్ట్రో అని కోహ్లీని అభివర్ణించాడు.
Last Updated : Nov 9, 2022, 1:31 PM IST