తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ తప్పు మళ్లీ రిపీట్​ చేయొద్దు.. మ్యాచ్​ రోజే ఫైనల్​ టీమ్​ సెలెక్ట్​ చేయండి'

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు టీమ్ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‍కే ప్రసాద్. 2021 ఫైనల్ అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు చేయొద్దని సూచించారు.

wtc final
wtc final

By

Published : Jun 2, 2023, 8:27 PM IST

WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న భారత ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన భారత్​- ఆస్ట్రేలియా మధ్య లండన్​లోని ఓవల్‍ మైదానంలో ఈ ఫైనల్ మొదలుకానుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు ముందు టీమ్‍ఇండియాకు ఓ హెచ్చరిక జారీ చేశారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‍కే ప్రసాద్. 2021లో న్యూజిలాండ్‍తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా చేసిన తప్పును టీమ్​ఇండియా ఇప్పుడు చేయకూడదని సూచించారు.

ఓవల్‍లో వాతావరణ పరిస్థితులను గమనించి తుది జట్టు గురించి మ్యాచ్ రోజే నిర్ణయించుకోవాలని ఎంఎస్‍కే ప్రసాద్ సూచించారు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ అప్పుడు తుది జట్టును ముందే ప్రకటించి, అందులో ఇద్దరు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను తీసుకున్నామని, వాతావరణం మారినా మ్యాచ్ రోజు జట్టును మార్చకపోవడం మైనస్ అయిందని చెప్పారు. అందుకే ఈసారి తుది జట్టును ముందే ఎంపిక చేసుకోకుండా.. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు పరిస్థితులను బట్టి సెలెక్ట్ చేసుకోవాలని సూచించారు.

"మేం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను (2021లో) తుది జట్టులో ఎంపిక చేశాం. అయితే ఆ తర్వాత వర్షం కురిసింది. మేం మా ప్లాన్‍ను మార్చుకోవాల్సింది. కానీ అదే తుదిజట్టుతో బరిలోకి దిగాం. అయితే అది గతం. ఓవల్‍లో ఉండే పరిస్థితులపై అంతా ఆధారపడి ఉంటుంది. పిచ్, వాతావరణ పరిస్థితులే ముఖ్యం. ఐదు రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకే ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి" అని ఎంఎస్‍కే ఓ ఇంటర్వ్యూలో అన్నారు

పంత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం
WTC Final Team India Squad : భారత టెస్టు క్రికెట్‍లో రిషబ్ పంత్ చేసినట్టు మరే వికెట్ కీపర్ కూడా ఇంతవరకు చేయలేదని ఎంఎస్‍కే ప్రసాద్ అన్నారు. టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో పంత్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‍ను గెలిపించాడు. యాక్సిడెంట్ గాయాల నుంచి పంత్ ప్రస్తుతం కోలుకుంటుండగా.. ప్రస్తుతం వికెట్ కీపర్లుగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఉన్నారు. అయితే, తుది జట్టులో కేఎస్ భరత్‍కే ఛాన్స్ దక్కే అవకాశం ఉందని ఎంఎస్‍కే అన్నారు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‍లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ అనే మలుపులు తిరుగగా.. చివరికి కోహ్లీ సేన పరాజయం పాలైంది.

డీడీ స్పోర్ట్స్​లో లైవ్​..
WTC Final 2023 DD Sports : వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌ (డీడీ ఫ్రీ డిష్‌) ఛానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దూరదర్శన్‌ స్పోర్ట్స్‌ ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. ‌దేశవ్యాప్తంగా ఉన్న​ క్రికెట్‌ అభిమానులు తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details