అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది భారత క్రికెటర్, టీమ్‌ఇండియా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. అన్ని ఫార్లాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.
ఇంగ్లాండ్ మహిళల జట్టుతో మూడో వన్డేలో.. ఈ ఫీట్ సాధించింది మిథాలీ. ఆ టీమ్‌కే చెందిన మాజీ క్రికెటర్ ఛార్లొటే ఎడ్వర్డ్స్ (10,273) ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉంది. ఆమెను దాటేందుకు మిథాలీకి కేవలం 12పరుగులు అవసరం కాగా, శనివారం నాటి ఇన్నింగ్స్‌తో అది కాస్తా పూర్తి చేసింది.
మిథాలీ ఘనతలు..
- వన్డేల్లోనూ 7 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ ఉమెన్ మిథాలీనే.
- ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్
- అన్ని ఫార్మాట్లలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్ ఉమెన్