టీ20 ప్రపంచకప్‌లో అంతగా రాణించలేకపోతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. కీలక సమయాల్లో కఠిన నిర్ణయాలను తీసుకొని జట్టును విజయం పథంలో నడిపిస్తున్నాడు. నవంబర్ 10న ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ నాయకత్వంపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. ఐసీసీకి సంబంధించి రాసిన వ్యాసంలో మిథాలీరాజ్ పలు విషయాలను పేర్కొంది.
రోహిత్ కెప్టెన్సీపై ఐసీసీకి మిథాలీ లేఖ.. జట్టుపై ప్రభావం పడకుండా.. - రోహిత్ శర్మపై మిథాలీ రాజ్ ప్రశంసలు
టీ20 ప్రపంచకప్‌లో ఇబ్బందిగా పరుగులు చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసింది మహిళా జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్. ఐసీసీకి రాసిన వ్యాసంలో ఆమె హిట్మ్యాన్ సారథ్యం గురించి ప్రస్తావించింది. ఏం రాసిందంటే?
"ప్రపంచకప్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ తీరు బాగుంది. అందులోనూ కొన్ని క్లిష్టసమయాల్లో తీసుకొన్న నిర్ణయాలు మాత్రం అద్భుతం. అయితే కెప్టెన్సీని ఇంకా మెరుగ్గా చేయవచ్చని వాదించేవారూ లేకపోలేదు. కానీ, చాలా ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకోవడం సారథికి కత్తిమీద సామే. చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రపంచకప్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు జట్టును లక్ష్యం వైపు నడిపించేలా చేయడం ప్రతి కెప్టెన్ బాధ్యత. టైటిల్ విజేతగా నిలపడంలో సారథి చాలా కీలకం. ఏదైనా మ్యాచ్‌లో ఓడినా సరే ఆ ప్రభావం జట్టు మీద పడనీయకుండా చూడాలి" అని మిథాలీరాజ్ తెలిపింది.
ఇదీ చూడండి:మిస్టర్ 360కి.. టెస్టు యోగం ఎప్పుడో..!