తెలంగాణ

telangana

ETV Bharat / sports

Mithali Raj: మా అందరి లక్ష్యం ఒక్కటే - women team india england series

ఇంగ్లాండ్​లో టెస్టు మ్యాచ్ గురించి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని భారత మహిళల టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. కోచ్ రమేశ్ పొవార్​తో వివాదం గడిచిపోయిన అంశమని, దాన్ని మర్చిపోయి జట్టు కోసం తామిద్దరం కలిసి పనిచేస్తామని తెలిపింది. పొవార్​ లక్ష్యం. జట్టులోని ప్లేయర్స్​ లక్ష్యం ప్రపంచకప్ ఒక్కటే అని వెల్లడించింది.

Mithali Raj
మిథాలీ రాజ్

By

Published : May 31, 2021, 8:42 AM IST

ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్ట్​ సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది భారత మహిళల టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. కోచ్​ రమేశ్​ పొవార్​తో జరిగిన వివాదం గతమని, ప్రస్తుతం దాన్ని మర్చిపోయి తామిద్దరం కలిసి పనిచేస్తామని వెల్లడించింది. ఇంకా పలు విషయాలను పంచుకుంది. అవన్నీ ఆమె మాటల్లోనే...

రమేశ్ పొవార్ వివాదం గతం. అక్కడే ఉండలేం. దాన్ని వదిలేసి ముందుకు సాగాలి. 21 ఏళ్ల కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. టీమ్ ఇండియా తరపున ఆడుతున్నామంటే దేశానికి సేవ చేస్తున్నట్లే. ఇక్కడ వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు స్థానం లేదు. నేను వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వను కూడా. గతంలో ఎన్నో ఘటనలు జరిగాయి. అలాంటి వాటిని అక్కడితో వదిలేస్తా.. కొనసాగించను. అహానికి పోయే మనస్తత్వం కాదు నాది. లేదంటే ఇన్నేళ్లు జట్టులో కొనసాగలేకపోయేదాన్ని. ప్రస్తుతం రమేశ్ మాకు కోచ్. అతడికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. జట్టును ముందుకు తీసుకెళ్లడానికి మేమిద్దరం కలిసి పనిచేయాల్సిన అవసరముంది. అతడి లక్ష్యం. జట్టులో మా అందరి లక్ష్యం ఒక్కటే... ప్రపంచకప్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలి.

అదే ముఖ్యం

ఇంగ్లాండ్​లో క్వారంటైన్ ముగిశాక కొద్ది రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ఆడనున్నాం. సన్నాహాకానికి పెద్దగా సమయం లేదు. జట్టులో అమ్మాయిలకు ఈ విషయం తెలుసు. టెస్టు మ్యాచ్​కు వాళ్లంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నా. చాలా మంది మానసికంగా సిద్ధమవుతున్నారు. అయితే మైదాన పరిస్థితులకు అలవాటు పడటం చాలా ముఖ్యం. ఇంగ్లాండ్​లో క్వారంటైన్ ముగిశాకనే అది సాధ్యమవుతుంది.

సరైన ప్రాక్టీస్ కావాలి

అంచనాలు లేకపోవడం జట్టుకు కొన్నిసార్లు మంచి చేస్తుంది. జట్టులో చాలా మంది అమ్మాయిలు టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయనున్నారు. సీనియర్లలో కొందరు సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు ఆడనున్నారు. బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్​లో టెస్టు మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ చేస్తుండటం గొప్పగా ఉంది. ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా ఎక్కువ మ్యాచ్​లు ఆడాలని కోరుకుంటారు. టెస్టు మ్యాచ్ ఆడాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆస్ట్రేలియాలో డేనైట్ టెస్టు మ్యాచ్ సమయానికి మాకు సరైన ప్రాక్టీస్ లభిస్తుందని ఆశిస్తున్నా.. ఇంగ్లాండ్​తో టెస్టు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ సీజన్​లో రెండు టెస్టులు ఆడుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది.

ఇదీ చూడండి French Open: థీమ్‌ ఇంటికి.. ఒసాకాకు జరిమానా

ABOUT THE AUTHOR

...view details