ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాకింగ్స్(icc women's odi ranking)లో టీమ్ఇండియా మహిళా సారథి మిథాలీ రాజ్(mithali raj ranking icc) తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. ఈ సిరీస్‌లో మిథాలీ 29 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం 738 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయిందీ సీనియర్ బ్యాటర్. దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లే లీ (761) అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్ బ్యాటర్ అలిసా హేలీ (750) రెండో ర్యాంకుకు చేరుకుంది. టీమ్ఇండియా స్టైలిష్ బ్యాటర్ స్మృతి మంధాన(smriti mandhana ranking) ఒక ర్యాంకు మెరుగు పర్చుకుని 710 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది.
అగ్రస్థానం కోల్పోయిన మిథాలీ.. గోస్వామి, మంధాన పైపైకి - జులాన్ గోస్వామి రెండో ర్యాంకుకు
ఐసీసీ (ICC odi ranking) తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్(icc women's odi ranking)లో అగ్రస్థానాన్ని కోల్పోయింది టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్. భారత పేసర్ జులాన్ గోస్వామి రెండో ర్యాంకుకు చేరుకోగా.. స్మృతి మంధాన తన ర్యాంకును మెరుగుపర్చుకుంది.
బౌలింగ్ విభాగానికి వస్తే భారత సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామి(jhulan goswami ranking) రెండో ర్యాంకుకు ఎగబాకింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మూడు వన్డేల్లో 4 వికెట్లు సాధించి ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. ఫైనల్లో మ్యాచ్‌లో మూడు వికెట్లతో అలరించింది. ఫలితంగా ఆల్‌రౌండర్ల విభాగంలోనూ మూడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది గోస్వామి. బౌలర్ల విభాగంలో జులాన్ కంటే ముందు 760 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఆస్ట్రేలియా బౌలర్ జెస్ జొనాస్సెన్. మరో ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ మూడో స్థానంలో నిలిచింది.
ఆల్‌రౌండర్ల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ తన అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాకు చెందిన మరిజానే కప్ టాప్‌లో ఉండగా నటాలియా సీవర్ రెండో ర్యాంకుకు చేరుకుంది. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక ర్యాంకు పడిపోయి ఐదో స్థానానికి చేరుకుంది.