Mitchell Starc Ipl 2024 Auction :2024 ఐపీఎల్ వేలంలో గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఆస్ట్రేలియా పేస్‌గన్ మిచెల్ స్టార్క్ కనీవిని ఎరుగని రీతిలో ఆల్‌టైమ్ ప్రైజ్ దక్కించుకున్నాడు. అతడ్ని వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. స్కార్క్ కోసం బిడ్డింగ్‌లో గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు స్టార్క్ కోసం ప్రయత్నించాయి. చివరికి కోల్‌కతా అతడ్ని సొంతం చేసుకుంది.
Sunrisers Hyderabad Pat Cummins : ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ వద్ద ప్రారంభమైన బిడ్డింగ్‌లో సన్‌రైజర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కమిన్స్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి ఈ బిడ్డింగ్ నుంచి బెంగళూర్ డ్రాప్ అవ్వండం వల్ల కమిన్స్‌ను హైదరాబాద్ సొతం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరకి కొనుగోలైన ఆటగాళ్లుగా స్టార్క్, కమిన్స్ నిలిచారు. కాగా, వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లే కావడం విశేషం.
Daryl Mitchell 2024 IPL Price: న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కూడా తొలిసారి వేలంలోనే భారీ ధరకు అమ్ముడయ్యాడు. అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అతడు 9 ఇన్నింగ్స్‌ల్లో 60 సగటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.