Mitchell Marsh World Cup :ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్ పోరులో ఆసీస్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే విక్టరీ అనంతరం రెస్ట్ రూమ్‌లో ఆ జట్టు ఆటగాడు మిచెల్ మార్ష్.. వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు నెటిజెన్స్. అంతేకాకుండా కొందరు మాజీ ఆటగాళ్లు సైతం మార్ష్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వీటిన్నింటిపై స్పందించాడు ఈ కంగారూ ప్లేయర్.
క్రికెట్‌ను అభిమానించే వాళ్లే కాకుండా ఆ ఆట విలువ తెలిసిన ప్రతిఒక్కరూ ఎంతో గౌరవంగా భావించే ప్రపంచకప్ ట్రోఫీపై మార్ష్ కాళ్లు పెట్టడం ఇటీవలే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే నెటిజెన్స్ కామెంట్స్‌తో పాటు ఇతరుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు మార్ష్. తాను చేసిన ఈ చర్యను సమర్థించుకోవడమే గాక కావాలంటే ఇంకోసారి కూడా ట్రోఫీపై కాళ్లు పెడతానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ ఫొటోలో ట్రోఫీని అగౌరపరిచినట్లు ముమ్మాటికీ ఏం లేదని చెప్పాడు. దీంతోపాటు దీనిపై తాను అంతగా ఆలోచించలేదని అన్నాడు. చాలా మంది తనకు చెప్పారని.. కానీ తాను సోషల్ మీడియాలో చూడలేదని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అందులో ఏమీ లేదని.. ఇక మళ్లీ అలా చేస్తావా అని అడిగితే.. కచ్చితంగా చేస్తాను సమాధానం ఇచ్చాడు.
ఇదీ జరిగింది..
నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ప్రపంచకప్ పైనల్ పోరులో కంగారూలు 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తేలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కప్పును అందుకున్న ఆసీస్ టీమ్.. దానిని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లింది. అనంతరం ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఒక్కొక్కరు కప్పుతో ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే మిచెల్ మార్ష్ కూడా కాస్త భిన్నంగా వరల్డ్‌కప్‌తో ఫొటో దిగాడు. ఏకంగా తన రెండు కాళ్లను టైటిల్‌పై వేసి సోఫాపై కూర్చున్నాడు. పైగా చేతిలో ఓ మందు సీసా పట్టుకొని కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కెప్టెన్ పాట్ కమిన్స్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ అంశంపై క్రికెట్ లోకమంతా తీవ్ర స్థాయిలో మండిపడింది.