Mitchell Marsh World Cup :ఆస్ట్రేలియా ప్రస్తుతం 2023 వరల్డ్‌కప్ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన ఆటగాళ్లు ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాము గెలిచిన ట్రోఫీని చూసుకుంటు తెగ మురిసిపోతున్నారు. అయితే ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం కాస్త అతిగా ప్రవర్తించాడు. డ్రింక్ బాటిల్ చేతిలో పట్టుకొని సోఫాలో కూర్చున్న మార్ష్.. ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు చాపుకున్నాడు.
ఈ ఫొటోను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే వరల్డ్‌కప్ ట్రోఫీపై అలా కాళ్లు వేయడం పట్ల.. క్రికెట్ ఫ్యాన్స్ మిచెల్ మార్ష్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరుతున్నారు. అలాగే 2011లో టీమ్ఇండియా ప్లేయర్లు ట్రోఫీని ముద్దాడిన ఫొటోలు వైరల్ చేస్తూ.. 'వరల్డ్‌కప్‌నకు ఎలా మర్యాద ఇవ్వాలో ఇండియన్స్‌ని చూసి నేర్చుకో' అంటూ ట్విట్టర్లో మార్ష్‌ను కడిగేస్తున్నారు.
Mitchell Marsh World Cup Viral Photo :గతేడాది లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను గెలిచింది. అప్పుడు మెస్సీ ఆ కప్‌ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ తన రూమ్‌లో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక 2011లో సచిన్ తెందూల్కర్, ధోనీ వంటి ప్లేయర్లు వరల్డ్ కప్‌ను ఎంతో అపురూపంగా చూసుకున్నారు. దీంతో ఇప్పుడు మెస్సీ, భారత ప్లేయర్లు చేసిన దానికి.. ఇప్పుడు మిచెల్ చేసినదానికి వ్యత్యాసం ఉందంటూ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. అలా నెటిజన్లు మండిపడి సోషల్ మీడియా కామెంట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేశారు.
- "అది వరల్డ్ కప్.. దయ చేసి గౌరవం ఇవ్వండి"
- "విజేతగా నిలవడానికి వారు అర్హులే. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం దారుణం. వారి స్థాయి దిగజారిపోతోంది"
- "ట్రోఫీని గౌరవించకపోతే.. వారు విజేతలుగా నిలిచినా ప్రయోజనం లేదు. మిచెల్ మార్ష్ నువ్వు చేసిన పనికి సిగ్గుపడాలి"
- "దిగ్గజాల నుంచి మిచెల్ చాలా నేర్చుకోవాలి. క్రికెట్ గాడ్ సచిన్ చివరి సారిగా వరల్డ్ కప్‌ను ముద్దాడిన తీరు ఇప్పటికీ గుర్తుండిపోతుంది"
ఈ హీరోలకిదే లాస్ట్ వరల్డ్ కప్!- మళ్లీ మెగాటోర్నీలో కనిపించరా?
విరాట్ 50వ శతకం, మ్యాక్సీ డబుల్ సెంచరీ - ఈ టోర్నీలో స్పెషల్స్ ఇవే!