తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీసేనను ఎగతాళి చేసిన వాన్.. మండిపడుతోన్న ఫ్యాన్స్ - కోహ్లీసేనను ఎగతాళి చేసిన వాన్

టీమ్ఇండియాపై మరోసారి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్. కోహ్లీసేనను ఎగతాళి చేస్తున్నట్లు పోస్టు పెట్టాడు.

Michael Vaughan
మైఖేల్ వాన్

By

Published : Jul 1, 2021, 6:31 PM IST

ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ మరోసారి టీమ్‌ఇండియాను ఎగతాళి చేశాడు! మహిళల క్రికెట్‌ జట్టును ప్రశంసిస్తూ కోహ్లీసేనపై వెటకారం గుప్పించాడు. కనీసం ఒక భారత జట్టైనా ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు పర్యటిస్తున్నాయి. ఏకైక టెస్టు మ్యాచును డ్రా చేసుకున్న మిథాలీ సేన 3 వన్డేల సిరీసును 2-0 చేజార్చుకుంది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శనే చేసింది. దీనిపై స్పందిస్తూ.. "భారత మహిళల జట్టు ఈ రోజు అద్భుత పోరాటం చేసింది.. ఇంగ్లీష్‌ పరిస్థితుల్లో కనీసం ఒక భారత జట్టైనా ఆడటం చూస్తుంటే బాగుంది.." అని ట్వీట్‌ చేశాడు వాన్. దీనిపై నెటిజన్లు అతడిపై ఫైర్‌ అవుతున్నారు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మహిళల జట్టు రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండింటినీ పోలుస్తూ వాన్‌.. పై ట్వీట్‌ చేసినట్టు తెలుస్తోంది. అలాగే కోహ్లీసేన రెండు ఇన్నింగ్సుల్లో 217, 170 మాత్రమే చేసింది. రెండో వన్డేలో మిథాలీ జట్టు 221 పరుగులు చేయడం గమనార్హం.

ఇవీ చూడండి IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details