న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ భారత్లో పుట్టుంటే కోహ్లీని మించి, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకునేవాడంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. దీనిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా స్పందించాడు. వన్డేల్లో ఒక్క సెంచరీ చేయని వాన్. కోహ్లీ, విలియమ్సన్ మధ్య పోలికలు పెడుతూ అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని బట్ విమర్శించాడు.
'ఫిక్సింగ్ చేసేపుడు ఈ స్పష్టత ఉంటే బాగుండు'
కోహ్లీ, విలియమ్సన్ మధ్య పోలికలతో వార్తల్లో నిలిచాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. వీటిపై స్పందించిన పాక్ క్రికెటర్ సల్మాన్ బట్.. అవి అర్థరహిత వ్యాఖ్యలని చెప్పాడు. దీనిపై ఘాటుగానే స్పందించాడు వాన్.
మైఖేల్ వాన్
దీంతో వాన్ మరింత ఘాటుగా స్పందించాడు. "బట్ నాపై చేసిన వ్యాఖ్యలు విన్నా. తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ అతడికుంది. అయితే 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో కూడా అతడికి ఇంతే స్పష్టత ఉంటే బాగుండేది" అన్నాడు. 2010 మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బట్ ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Last Updated : May 17, 2021, 11:42 AM IST