టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీని గెలిచింది. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టంతా వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ మీదకు మళ్లింది. 2023లో సొంత గడ్డపై కప్ గెలిచేది కచ్చితంగా టీమ్‌ఇండియానే అంటూ ఇప్పటికే అభిమానులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం తాను ఈ వాదనతో ఏకీభవించనని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు చేసిన అద్భుతం చూసిన తర్వాత కూడా టీమ్‌ఇండియా గెలుస్తుందనడం నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశాడు.
ODI Worldcup: 'నాన్సెన్స్.. టీమ్ఇండియాకు అంత సత్తా లేదు'
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గెలవలేదని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. ఇంగ్లాండే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
"భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ గెలవడమే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద విషయం. ఇంగ్లాండ్ జట్టు స్పిన్నింగ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నాయి. గెలుపు కూడా వారినే వరిస్తుందని అనుకోవచ్చు. సొంత గడ్డపై పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇక ఈ టోర్నమెంట్ గెలిచేది టీమ్‌ఇండియానే అంటారు. కానీ అదంతా వట్టిమాట. ఈ సారి కూడా ఇంగ్లాండ్‌దే పైచేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొన్నేళ్ల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయి" అంటూ మైఖేల్ పేర్కొన్నాడు. ఒకవేళ తానే టీమ్‌ఇండియాను నడిపిస్తే గర్వం పక్కనపెట్టి.. ఇంగ్లాండ్ జట్టును స్ఫూర్తిగా తీసుకుంటానని ఇటీవల ఈ మాజీ ఆటగాడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:హార్దిక్-కేన్ విలియమ్స్ రిక్షా సవారీ... వీడియో వైరల్