సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ)ఫైనల్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే అంశంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే డబ్ల్యూటీసీ తుదిపోరులో న్యూజిలాండ్ జట్టే గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కివీస్‌కు కలిసొస్తుందని పేర్కొన్నాడు.
'డబ్ల్యూటీసీ టైటిల్ కివీస్‌దే.. భారత్‌కు కష్టమే!' - డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మైఖేల్ వాన్
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కివీస్ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కివీస్‌కు కలిసొస్తుందని తెలిపాడు.
"ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్ గెలుస్తుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు భారత్ ఇక్కడికి చేరుకుంటుంది. కానీ ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు, డ్యూక్ బాల్(ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్‌ల్లో ఉపయోగించే బంతి), ఫైనల్ ముంగిట వార్మప్‌లాగా ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశాలు. ఎర్రబంతితో ముఖ్యంగా డ్యూక్ బాల్‌తో చాలా మంది కివీస్ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి న్యూజిలాండ్ గెలుస్తుందని అంచనా వేస్తున్నా" అని మైఖేల్ వాన్ అన్నాడు.