తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జడేజా అలా చేస్తే బాగుండేది..' జడ్డూ వివాదంపై ఆసీస్​ మాజీ కెప్టెన్ కామెంట్లు - రవీంద్ర జడేజా బాల్​ టాంపరింగ్

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టులో అనూహ్య ఘటన జరిగింది. రవీంద్ర జడేజా తన వేలికి ఆయింట్‌మెంట్‌ రాసుకుంటూ ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మాజీ క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై తాజాాాగా ఆసీస్​ మాజీ సారథి మైఖేల్​ క్లార్క్​ స్పందించాడు. జడేజా అలా చేసి ఉండకూడదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నాడంటే..

ravindra jadeja controversy
ravindra jadeja controversy

By

Published : Feb 10, 2023, 9:56 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఆధిక్యం సాధించింది. కాగా, మొదటి రోజు బౌలింగ్‌ చేసే సమయంలో టీమ్ఇండియా ప్లేయర్ రవీంద్ర జడేజా తన ఎడమ చేతి వేలికి ఆయింట్‌మెంట్‌ పూసుకోవడం చర్చనీయాంశమైంది. కంగారూ జట్టు అభిమానులు బాల్‌ ట్యాంపరింగ్‌ అంటూ ఆరోపణలూ చేశారు. కానీ పలువురు మాజీలు మాత్రం.. అలా చేసే సమయంలో బంతి చేతిలో ఉండకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే అంశంపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ క్లార్క్‌ స్పందించాడు. బంతి చేతిలో ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్​ క్రీమ్‌ను అలా రుద్దకుండా ఉంటే బాగుండేది అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్​ మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌ వేశాడు. దీని కారణంగా అతడి వేలు బొప్పి కట్టడం ఉండవచ్చు. లేదా కోసుపోయినట్లు అనిపించి ఉండొచ్చు. అందుకే అతడు క్రీమ్​ పూసికొని ఉంటాడు. అయితే, ఇలా చేసే ముందు చేతిలోని బంతిని అంపైర్‌కు ఇచ్చి ఉంటే బాగుండేది. అంపైర్‌కు ఇచ్చేసి అతడి ముందే జడేజా క్రీమ్​ రాసుకొని ఉంటే ఇదొక చర్చనీయాంశం అయ్యేది కాదు. ఇప్పటికీ నేను దీనిని పెద్ద విషయంగా పరిగణించడం లేదు. కానీ, అతడి చేతిలో బంతి లేకుండా ఉంటే బాగుండేదని మాత్రమే నేను కోరుకుంటా. ఇందులో ఏదో జరిగిందని నేను అనుకోవడం లేదు. అయితే, నా అంచనా కూడా వందశాతం తప్పు కావచ్చు" అని క్లార్క్‌ అన్నాడు.
తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్​ అయింది. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా 7 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్‌లో అర్ధశతకం సాధించిన రవీంద్ర జడేజా 66* తొలి రోజు 5 వికెట్ల తీసి రాణించాడు.

ABOUT THE AUTHOR

...view details