ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నడి రోడ్డుపై చెంప దెబ్బలు తిన్న సంఘటన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. అయితే తాజాగా దీనిపై క్లార్క్ స్పందించాడు. "ఇలాంటి సంఘటన పట్ల ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను అత్యంత గౌరవ స్థానంలో ఉండేందుకు మీరంతా సహకారం అందించారు. మహిళలను ఆకర్షించుకొని ఇలాంటి పరిస్థితికి దిగజారినట్లు వచ్చిన ఆరోపణలు నన్ను మానసికంగా కుంగదీశాయి" అని క్లార్క్ వెల్లడించాడు.
అసలేం జరిగిందంటే.. తనను మోసం చేస్తున్నాడని క్లార్క్ గర్ల్ ఫ్రెండ్ జేడ్ యార్బ్రో అతడిని బహిరంగంగానే చెంప దెబ్బలు కొట్టింది. వేరే అమ్మాయితో ఉంటూ తనను మోసం చేస్తున్నాడని ఆరోపించింది. శారీరక సంబంధం పెట్టుకున్నాడని విమర్శలు గుప్పించింది. ఆమెతో చేసిన చాటింగ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేసింది.