టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సందర్భంగా భారత్, పాకిస్థాన్ జట్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్. ఈ మెగాటోర్నీ ఫైనల్లో భారత్, పాక్(Ind vs Pak t20 World Cup) ఆడితే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దుబాయ్‌లో నిర్వహించిన సలామ్ క్రికెట్(Salaam Cricket 2021) కార్యక్రమంలో పాల్గొన్న గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మరో రెండు రోజుల్లో టీమ్ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఐసీసీ కూడా భారత్, పాక్ ఫైనల్లో ఆడాలని భావిస్తుందని, అందరి ఆశ కూడా ఇదేనని గావస్కర్ పేర్కొన్నాడు. టీమ్ఇండియా మెంటార్ ధోనీపై(Dhoni Mentor) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
"మెంటార్ తాను చేయాల్సిన సహాయం చేస్తాడు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌తో బ్రేక్ సమయాల్లో మాట్లాడగలడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సలహాలు ఇవ్వగలడు. మైదానంలో విజృంభించాల్సింది మాత్రం ఆటగాళ్లే. ముఖ్యంగా మిడిలార్డర్. వాళ్లు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనేదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది."