ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల(Australia vs Afghanistan Test 2021) మధ్య నవంబర్‌లో ఓ టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్ నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. అఫ్గాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించకపోతే.. పురుషుల జట్టుతోనూ తాము టెస్టు ఆడబోమని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia Afghanistan) ప్రకటించింది.
"ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడం అవసరం. క్రికెట్ అనేది అందరి క్రీడ. మహిళలనూ సమానంగా చూడాలి, వారికీ ఆడే అవకాశం కల్పించాలి" అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.