తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈసారైనా టైటిల్​ దక్కుతుందా అనుకున్నా'

ఐసీసీ టైటిల్​ మరోసారి న్యూజిలాండ్​తో దోబూచులాడుతుందేమోనని భయపడినట్లు ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్​కలమ్ తెలిపాడు. సుదీర్ఘ విరామం అనంతరం టెస్టుల్లో ప్రపంచ టైటిల్​ గెలుపుతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నాడు.

Brendon McCullum
డబ్ల్యూటీసీ టైటిల్

By

Published : Jun 24, 2021, 5:05 PM IST

ప్రపంచ టైటిల్​ నెగ్గడంలో న్యూజిలాండ్​కు మరోసారి చేదు అనుభవం ఎదురవుతుందోమోనని భయపడినట్లు ఆ దేశ మాజీ సారథి బ్రెండన్ మెక్​కలమ్ తెలిపాడు. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు మొట్టమొదటి టెస్టు ఛాంపియన్​షిప్​లో గెలిచి జగజ్జేతగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

"కొన్నేళ్లుగా న్యూజిలాండ్ ప్రదర్శన గొప్పగా సాగుతోంది. కానీ, అసలైన విజయానికి చేరువలో వచ్చి నిలిచిపోతున్నారు. అయితే, సంప్రదాయ క్రికెట్ ఫార్మాట్​(టెస్టు)లో ఇలాంటి ఘనత సాధించడం అద్భుతం. మంగళవారం రాత్రికి మ్యాచ్​ ఫలితం ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠలో ఉన్నా. గత రెండు వన్డే ప్రపంచకప్​ ఫైనల్​​ చేదు అనుభవాలు మరోసారి ఎదురవుతాయా అనిపించింది. ప్రతికూల వాతావరణంలో అసామాన్య టీమ్​ఇండియాపై గెలుపొందడం అద్వితీయం."

-బ్రెండన్ మెక్​కలమ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్

టీమ్​ఇండియాతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో డబ్ల్యూటీసీ టైటిల్​ కైవసం చేసుకుంది కివీస్. 2000లో ఛాంపియన్స్​ ట్రోఫీ మినహా ఏ ఇతర ఐసీసీ టైటిల్​ నెగ్గని ఆ జట్టు.. సుదీర్ఘ పోరాటం అనంతరం టెస్టుల్లో ఆ ఘనత సాధించింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్​లలో ఫైనల్​ చేరిన న్యూజిలాండ్​ రన్నరప్​గానే మిగిలింది.

ఇదీ చూడండి:Cricket: ఏడు ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే

ABOUT THE AUTHOR

...view details