క్రికెట్.. వివక్ష చూపని ఆటగా నిలవాలంటే 'బ్యాట్స్మన్' అనే పదాన్ని తొలగించాలని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ అభిప్రాయపడింది. ఈ పదానికి బదులుగా లింగ బేధం చూపని 'బ్యాటర్' అనే పదాన్ని వాడనున్నట్లు ప్రకటించింది. సబ్ కమిటీతో ప్రత్యేకంగా చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్సీసీ పేర్కొంది.
"చివరగా 2017లో అంతర్జాతీతయ క్రికెట్ కౌన్సిల్, పలు మహిళా క్రికెటర్ల సూచన మేరకు.. బ్యాట్స్మన్, బ్యాట్స్మెన్ అనే పదాలను ఉపయోగించేందుకు అంగీకరించాం. అయితే.. ప్రస్తుతం క్రికెట్లో అధునాతన మార్పులు తీసుకొచ్చేందుకుగాను బ్యాటర్, బ్యాటర్స్ అనే పదాలు వాడాలని నిర్ణయించుకున్నాం. బౌలర్, ఫీల్డర్ మాదిరిగానే ఈ బ్యాటర్ అనే పదం కూడా అందరికీ ఆపాదించేలా ఉంటుంది."
--మెరిల్బోన్ క్రికెట్ క్లబ్.