తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​ కింగ్స్​ కొత్త కెప్టెన్ అతడే​.. వారంలో అధికారిక ప్రకటన!

Punjab kings Captain Mayank Agarwal: భారత బ్యాటర్​ మయాంక్ అగర్వాల్​ పంజాబ్​ కెప్టెన్​ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వారం చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

mayank agarwal
మయాంక్​ అగర్వాల్​

By

Published : Feb 24, 2022, 11:42 AM IST

Punjab kings Captain Mayank Agarwal: ఐపీఎల్​ వేలం పూర్తవడం, పలు ప్రాంఛైజీలు కెప్టెన్లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఏ ఈ క్రమంలో భారత బ్యాటర్​ మయాంక్​ అగర్వాల్​ను​ కెప్టెన్​గా నియమించే యోచనలో పంజాబ్​ కింగ్స్​ ఉన్నట్లు ఉంది. ఈ వారం చివరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. వేలంకు ముందే మయాంక్​(రూ.12కోట్లు), పేసర్​ హర్షదీప్​సింగ్​ను(రూ.4కోట్లు) పంజాబ్​ రిటెయిన్ చేసుకుంది.​

"ధావన్​ ఛాంపియన్​ ఆటగాడు. అతడు జట్టులోకి రావడం వల్ల అదనపు బలం చేకూరుతుంది. రాహుల్​ జట్టును వదిలిపెట్టిన నాటి నుంచి మయాంక్​నే కెప్టెన్​గా అనుకున్నాం"అని క్రికెట్​ వర్గానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

పంజాబ్​ మెగావేలంలో మంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. శిఖర్​ ధావన్​, జానీ బెయిర్​స్టో, లియామ్​ లింవింగ్​స్టోన్​, కగిసో రబడ, హర్​ప్రీత్​ బ్రార్​, తమిళనాడు సంచలనం షారుక్​ ఖాన్​ను దక్కించుకుంది.

గత కొన్ని సంవత్సారాలుగా మయాంక్​ అగర్వాల్​, కెఎల్​ రాహుల్​ జోడీ ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేసింది. జట్టుకు నుంచి బయటకు వచ్చిన రాహుల్​ ప్రస్తుతం కొత్త జట్టు లక్నో సూపర్​జెయింట్​ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది రాహుల్​కు గాయమైన సమయంలో మయాంక్​ కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించిన అనుభవం కూడా ఉంది. గత రెండు సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించాడు. 2011లో ఐపీఎల్​లో అడుగుపెట్టిన అతడు 100కు పైగా మ్యాచులు ఆడగా..భారత్​ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.

ఇప్పటి వరకూ కప్పు గెలవని పంజాబ్​ ఈ సారైనా ట్రోఫీని దక్కించుకోవాలని ఆశలు పెట్టుకుంది. 2014లో ఫైనల్లో అడుగుపెట్టిన పంజాబ్​ గత మూడు సీజన్లలోనూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ​

ఇదీ చదవండి:IND VS SL: కోహ్లీ, షోయబ్ రికార్డుకు చేరువలో రోహిత్​

ABOUT THE AUTHOR

...view details