Maxwell ODI Record : వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. (201* పరుగులు) వీరోచిత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కెప్టెన్స్ కమిన్స్‌తో కలిసి, ఒత్తిడి సమయంలోనూ అద్భుతంగా పోరాడి.. వన్డే కెరీర్లో తొలిసారి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు మ్యాక్స్‌వెల్. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి ఆసీస్ బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో మ్యాక్స్ సాధించిన మరికొన్ని ఘనతలు ఏంటో చూద్దాం.
- వన్డే మ్యాచ్ ఛేజింగ్‌లో 200+ స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డు కొట్టాడు. ఇదివరకు పాకిస్థాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ (193 పరుగులు Vs సౌతాఫ్రికా) టాప్‌లో కొనసాగాడు.
- వన్డేల్లో ఏడో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన బ్యాటర్లు మ్యాక్స్‌వెల్ - ప్యాట్ కమిన్స్. వీరిద్దరూ 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
- వన్డేల్లో ఓపెనర్‌గా కాకుండా బరిలోకి దిగి.. ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ మ్యాక్స్‌వెల్.
- వన్డే వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ బాదిన మూడో ఆటగాడు మ్యాక్స్‌వెల్. అతడి కంటే ముందు.. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ (237* పరుగులు) వెస్టిండీస్‌పై, విండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ (215 పరుగులు) జింబాబ్వేపై బాదారు. అయితే వీరిద్దరూ 2015 ఎడిషన్‌లోనే ఈ ఫీట్ సాధించారు.
- ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన లిస్ట్‌లో మ్యాక్స్‌వెల్ (43 సిక్స్‌లు) మూడో ప్లేస్‌లో ఉన్నాడు. అతడికంటే ముందు క్రిస్ గేల్ (49), టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (45) ఉన్నారు.
- ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ - కమిన్స్ 202 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అయితే ఇందులో 179 పరుగులు (88.6 శాతం) మ్యాక్స్వెల్వే. ఈ క్రమంలో కమిన్స్.. అతి తక్కువ శాతం పరుగుల భాగస్వామిగా రికార్డు సృష్టించాడు.
- వరల్ట్‌కప్ హిస్టరీలో 5 అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 3 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ మ్యాక్స్‌వెల్.
- వన్డేల్లో 6 అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మ్యాక్స్ రికార్డుకొట్టాడు.
- డబుల్ సెంచరీ సాధించేందుకు మ్యాక్స్.. 128 బంతులు తీసుకున్నాడు. వన్డేల్లో ఇది రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ. కాగా, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో) ఉంది.